Friday, December 18, 2009

శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు

కానడ రాగము ఆది తాళము

పల్లవి .. శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు
శ్రీ రాముడూ నా రాముడు

౧. దశరధునకు గారాల తనయుడు
మౌని యాగమును గాచిన ఘనుడు
శివ ధనువును అవలీలగా ద్రుంచి
సీతా దేవిని పరిణయమాడిన

౨. కైక మాటలకు కినుక వహింపక
కాంత జానకితొ కానల కేగి
పాదుకలను భరతునకొసగి
పాదపూజలు అందుకొనిన

౩. రావణుడంతట రమణి జానకిని
ఆపహరించెనని ఆర్తిని చెంది
సతిఎడబాటును సహించ నేరక
సహనశీలియై సతమతమైన

౪. హనుమ సహాయము జానకి జాడయు
చూడామణితో సంతసమంది
అనుజు లక్ష్మణుని అంజని సుతుని
ఆప్యాయతతో అక్కున జేర్చిన

౫. వానర బలముతొ వారధి దాటి
లంకను చేరి రణమును సలిపి
రావణు దునిమి రమణిని చేరి
రామరాజ్యముగ అయోధ్యనేలిన

రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment