ఆరభి రాగము త్రిశ్రనడ
పల్లవి..పాహి రామచంద్రప్రభో పలుకవేమిరా
కనికరించి నాదరికి కదలిరావదేలరా
నిరతము నీ నామమునే మదిని తలచు చుంటినిరా
నీవే నా దైవమ్మని నిన్ను కొలచు చుంటినిరా
సత్యవ్రతుడవు నీవని సకలము నీ కెరుకయని
హితులకు సన్నిహితులకు హితము కలుగ చేయుచుంటి
అడుగులకే మడుగులొత్తు అనుజుండే లక్ష్మణుండు
అహరహమును ప్రీతితోడ పులకరించు హనుమన్న
సాధ్వి సీత సపర్యలు సమ్మోహన పరచుచుండు
సకల జనుల సన్నుతుడవు యేమని నుతియింతునురా
రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
Sunday, December 20, 2009
Saturday, December 19, 2009
శ్రీ సీతారామ కళ్యాణం
ఆరభి రాగము ఆదితాళము
శ్రీ రాముడు శివ ధనువు నెత్తగ
జానకి హృదయము ఝల్లుమనె
ఫెళ ఫెళ మనెను పెను రవమయ్యె
మిథిలా నగరము మోదమునందె
శ్రీ రాముడు శివ ధనువు నెత్తగ
జానకి హృదయము ఝల్లుమనె
ఫెళ ఫెళ మనెను పెను రవమయ్యె
మిథిలా నగరము మోదమునందె
జనకుడానంద పరవసుడయ్యె
విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యె
దశరధుడెంతయొ సంతసించెను
అయోధ్య పొంగెను హర్షము తోడ
జానకి రాముల పరిణయమాయెను
జగము పులకించె జయము జయమ్మని
రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యె
దశరధుడెంతయొ సంతసించెను
అయోధ్య పొంగెను హర్షము తోడ
జానకి రాముల పరిణయమాయెను
జగము పులకించె జయము జయమ్మని
రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
Friday, December 18, 2009
శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు
కానడ రాగము ఆది తాళము
పల్లవి .. శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు
శ్రీ రాముడూ నా రాముడు
౧. దశరధునకు గారాల తనయుడు
మౌని యాగమును గాచిన ఘనుడు
శివ ధనువును అవలీలగా ద్రుంచి
సీతా దేవిని పరిణయమాడిన
౨. కైక మాటలకు కినుక వహింపక
కాంత జానకితొ కానల కేగి
పాదుకలను భరతునకొసగి
పాదపూజలు అందుకొనిన
౩. రావణుడంతట రమణి జానకిని
ఆపహరించెనని ఆర్తిని చెంది
సతిఎడబాటును సహించ నేరక
సహనశీలియై సతమతమైన
౪. హనుమ సహాయము జానకి జాడయు
చూడామణితో సంతసమంది
అనుజు లక్ష్మణుని అంజని సుతుని
ఆప్యాయతతో అక్కున జేర్చిన
౫. వానర బలముతొ వారధి దాటి
లంకను చేరి రణమును సలిపి
రావణు దునిమి రమణిని చేరి
రామరాజ్యముగ అయోధ్యనేలిన
రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
పల్లవి .. శ్రీ రాముడే నా రాముడు శ్రీ రాముడు నా రాముడు
శ్రీ రాముడూ నా రాముడు
౧. దశరధునకు గారాల తనయుడు
మౌని యాగమును గాచిన ఘనుడు
శివ ధనువును అవలీలగా ద్రుంచి
సీతా దేవిని పరిణయమాడిన
౨. కైక మాటలకు కినుక వహింపక
కాంత జానకితొ కానల కేగి
పాదుకలను భరతునకొసగి
పాదపూజలు అందుకొనిన
౩. రావణుడంతట రమణి జానకిని
ఆపహరించెనని ఆర్తిని చెంది
సతిఎడబాటును సహించ నేరక
సహనశీలియై సతమతమైన
౪. హనుమ సహాయము జానకి జాడయు
చూడామణితో సంతసమంది
అనుజు లక్ష్మణుని అంజని సుతుని
ఆప్యాయతతో అక్కున జేర్చిన
౫. వానర బలముతొ వారధి దాటి
లంకను చేరి రణమును సలిపి
రావణు దునిమి రమణిని చేరి
రామరాజ్యముగ అయోధ్యనేలిన
రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
Subscribe to:
Posts (Atom)